అచలగురూజీ వెంకటదాసార్యుల  పాదుకా పూజ మహోత్సవం..

 

పశ్చిమ గోదావరి జిల్లా , ఆచంట మండలం,  కాంభొట్ల పాలెం గ్రామంలోగల అచలగురు మందిరం నందు శ్రీమత్ బృహద్వాశిష్ట సిద్ధాంత నిర్ధారణో ద్ధారకులు. శ్రీ శివరామదీక్షిత అచలగురువారం పర్యులు, అమలానంద శ్రీ గొరకల యర్రయ్య ర్యుల శిష్యాగ్ర గ ణ్యులు అచలగురుమాతాజీ శీలం సూర్య కాంతమాంబ సమేత   అచలగురూజీ  వెంకట దాసార్యుల వారి పాదుకా పూజారాధన మహోత్సవం జూన్  తొమ్మిదవ తేదీ గురువారం అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా అచల జండా ఆవిష్కరణ, నిజగురు పాదపూజ, వేదాంత వైజ్ఞానిక సభ, శ్రీగురుభజనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సాంప్రదాయకులు పెద్దఎత్తున పాల్గొని శ్రీ గురుతీర్థ ప్రసాదములు స్వీక రించి గురుకటాక్షమునకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో సద్గుణ ప్రకాసాంబ   శీలం విజయలక్ష్మి, అచల పరిపూర్ణ  గురుప్రసాద్ రావు దంపతులు , నిశ్చలానంద శీలం ఆదినారాయణ,సద్గురు జ్ఞానానంద కుడిపూడి నాగేశ్వరరావు, పరిపూర్ణ జ్ఞానానంద శీలం సుబ్రహ్మణ్యేశ్వరరావు, అచలాంబ శీలం గంగారత్నం, నిర్మాలనంద వాసంశెట్టి జగదీశ్వరరావు, పరిపూర్ణ భావఙ్గని  వాసంశెట్టి భవాని, శీలం పావని, దేవగుప్తం, గెద్దాడవారిపాలెం భక్త బృందం   పాల్గొన్నారు.