భగవద్గీత పోటీల్లో యుక్తశ్రీకి స్వర్ణపతకం
విజయవాడ (గురు పథం ప్రతినిధి): శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమం, మైసూరు వారు నిర్వహించిన అంతర్జాతీయ భగవద్గీత పోటీల్లో విజయవాడకు చెందిన విద్యార్థిని పుల్లట యుక్తశ్రీ స్వర్ణ పతకం సాధించింది. కర్ణాటక రాష్ట్రం మైసూరులో జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి చేతుల మీదుగా యుక్త శ్రీ గోల్డ్ మెడల్ తో పాటు ప్రశంసా పత్రం అందుకుంది. భగవద్గీత పోటీల్లో అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు గణపతి సచ్చిదానంద స్వామి యుక్తశ్రీని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటూ దీవెనలు అందించారు. మైసూరులో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మే నెలలో జరిగిన భగవద్గీత తుది పరీక్షలో ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలకు గాను జరిగిన ఈ పరీక్షలో కుమారి యుక్తశ్రీ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ సాధించినందుకు పలువురు ప్రశంసించారు. ప్రముఖ సింగర్ ఉషా ఉతప్ కూడా యుక్తశ్రీ ప్రతిభను అభినందించారు. శాస్త్రీయ సంగీతంలో కూడా మరిన్ని బహుమతులు పొందాలని ఆకాంక్షించారు.

 

అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి గుడి వద్ద పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం.

దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు.

కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు.

ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు.

ఇది పేదవారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక.

అన్నవరం దేవస్థానంలో అధికారులు బుకింగ్‌లు ప్రారంభించారు, ఈ మండపంలో ఒకేసారి 12 జంటలకు వివాహం జరిపించేందుకు వీలుగా ఉంటుందని దేవస్థానం అధికారులు వివరించారు.

పెళ్లి వారికి కావలసిన పాత్రలు, పాదుకలు, కుర్చీలు ఇలా అన్నీ దాత శ్రీనివాస్ సమకూరుస్తారు.

పెళ్లి పేదలకు తలకు మించిన భారమే..!
అయితే వారు కూడా సాదాసీదాగా కాకుండా ఉన్నతంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు దాత శ్రీనివాస్ చెబుతున్నారు.

ఈ కళ్యాణ వేదికను ఈ నెల 16న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించగా.

వివాహాలు చేసుకునే వారి కోసం దేవస్థానం అధికారులు ఆదివారం నుంచి బుకింగ్స్ ప్రారంభించారు.

సంబంధిత పత్రాలు తీసుకువస్తే ఆయా తేదీలలో మండపాలను బుక్ చేస్తారు.

ఏసీ కళ్యాన మండపంలో వివాహం చేసుకోదల్చిన వారు లగ్న పత్రిక, వధూవరుల ఆధార్ జిరాక్స్, వారి తల్లిదండ్రుల ఆధార్ జిరాక్స్‌లను రత్నగిరిపై ఉన్న సీఆర్‌వో కార్యాలయంలో అందజేయాలి.

వారికి ఉచిత కళ్యాణ వేదిక నెంబరును కేటాయిస్తారు. ఆ నంబర్‌ను ఉచిత కళ్యాణ వేదిక వద్ద చూపించి వివాహ సామాగ్రిని పొందాల్సి ఉంటుంది.

ఈ మొత్తం ప్రక్రియలో ఎవరికీ ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదని ఆలయ అధికారులు వెల్లడించారు.

మీకు తెలిసిన
పదిమందికీ పంపండి, అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటారు.