( శరీరము )
దీక్షితులవారు శరీరము ఒకటే కలదని తెలియజేశారు , కనపడే దేహమునేను అనుకుంటే , ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఆగిపోతే అది జడంగా మారిపోతుంది , మరి ఏది శరీరమంటే శరీరమును గురించి మనకు తెలియజేయడానికి నాలుగు భాగాలుగా విభజించవలసి వచ్చినది , అది సాంఖ్యం ద్వారా మనపెద్దలు ఇలా సెలవిచ్చారు , 25 తత్వములతో స్తూలశరీరం , 17 తత్వములతో సూక్ష్మశరీరము , 36 తత్వాలతో కారణ శరీరము , పని చేయుచున్నదని సెలవిచ్చారు , ఈ మూడు శరీరములకు ( సత్తా నిచ్చి ) ఆధారమై అంతా తానే అయి తానుగాకనే వున్నది మహాకారణశరీరము , ఈ నాలుగు శరీరంలు మనకు ప్రత్యక్ష ప్రమాణం కావాలన్నచో ప్రత్యక్షంగా పెద్దలతో మనము త్రివిధ దీక్షలు పొందాలి అప్పుడు గురుముఖతః మూడు శరీరములు ప్రత్యక్ష ప్రమాణంగా తెలియ బడతాయి ఈ మూడు శరీరంలు తమను తామే తెలియవు , తానెవరో తెలుసుకొని ఈ మూడు శరీరములను తెలుసుకున్నది మహాకారణ శరీరమైన నాల్గవ శరీరం ఇది ఊహ కల్పితమైన మాటకాదు . ప్రత్యక్ష ప్రమాణంగా కారణ సంఖ్య రూపకంగా గురుముఖత దృష్ట ద్రాష్టాంతములతో తెలియవలసిన విషయమై వున్నది , ఏ ఇతర గ్రంథాల ద్వారా తెలియబడదని సెలవిచ్చారు , గురుముఖతః 4 శరీరములను తెలుసుకొని లేకుండా చేసుకున్నప్పుడే మనః ప్రాణముల కలయిక విడిపడి ఇక ఎరుక లేక పోతుంది , గట్టిగా లేచి పోనే పోతుందని సెలవిచ్చారు పెద్దలు , ఇక్కడే కృష్ణ ప్రభువులుకూడా వినుము నేననుచు యెరిగే తనువందున లేక అని తెలియజేస్తూ అచలగ్రంథం కూడా శోధించమని తెలియజేసినారు , జి మల్లికార్జున్.